27న వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం | YS Jagan Meeting With Party Leaders On 27th At Tadepalli | Sakshi
Sakshi News home page

27న వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం

May 25 2026 11:11 AM | Updated on May 25 2026 12:43 PM

YS Jagan Meeting With Party Leaders On 27th At Tadepalli

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ఎల్లుండి(బుధవారం) పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్‌ఐఆర్‌ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరగనుంది.

అలాగే, చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజా సమస్యలపై వైఎస్‌ జగన్‌ చర్చించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement