మావిగన్‌ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది: జగన్‌ | YS Jagan Key Comments On Amaravati In Press Meet | Sakshi
Sakshi News home page

మావిగన్‌ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది: జగన్‌

May 21 2026 11:38 AM | Updated on May 21 2026 12:23 PM

YS Jagan Key Comments On Amaravati In Press Meet

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని అన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మావిగన్‌ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది. చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్‌లో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.  

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కారణంగా ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచారు. అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకే రూ.2లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా అమరావతిపై ముందుకు వెళ్తున్నారు. స్కామ్‌ల కోసమే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అమరావతికి రూ.47,387 కోట్లు అప్పు చేశారు. ఖజానా నుంచి రూ.9200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. స్కామ్‌ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. రాష్ట్రానికి రాజధాని ఉండాలనే మావిగన్‌ను ప్రతిపాదించాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్‌ను ప్రత్యామ్నాయంగా చూపించాం. 

అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలి. చంద్రబాబు స్కామ్‌ల కోసం ఏపీని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలకు కూడా మావిగన్‌కు మద్దతు పలికారు. అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రులతో కూడా బూతులు మాట్లాడిస్తున్నారు. రూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌ ఉన్నా మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారు. కొత్తగా నిర్మిస్తున్న 5 బిల్డింగ్‌ల నిర్మాణం పేరుతో చంద్రబాబు దోపిడీ చూస్తే ప్రజలు నివ్వెరపోతున్నారు. భవన డిజైన్లకే రూ.401 కోట్లు. ఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.20,427?. వాటి ఫర్నీచర్‌, ఇంటీరియర్‌ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే  చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందన్నమాట. మళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే ఇచ్చారు. ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌కు కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే!. తెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్‌ సచివాలయం కట్టారు. మన సెక్రటేరియట్‌కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు?. కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారు. ఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనే’ అని తెలిపారు.

 

 

జంగిల్‌ రాజ్‌గా రాష్ట్రం.. 
ప్రజల బాగోగులను చంద్రబాబు గాలికి వదిలేశారు. రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌గా మార్చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారు. రెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలి. ఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్‌ ఒక్కటే.. ‘‘చం‍ద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు మాత్రం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోంది’ అని వ్యాఖ్యానించారు. 

Advertisement
 
Advertisement
Advertisement