దిశ ఎఫెక్ట్‌: విశాఖ స్పెషల్‌ పోక్సో కోర్టు సంచలన తీర్పు | Sakshi
Sakshi News home page

దిశ ఎఫెక్ట్‌: విశాఖ స్పెషల్‌ పోక్సో కోర్టు సంచలన తీర్పు

Published Tue, May 28 2024 5:52 PM

Visakha Special Pocso Court Sensational Verdict

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో 2017వ సంవత్సరంలో సంచలనం రేపిన కిడ్నాప్‌, లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు వెలువరించింది. 5 వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు గణేష్ కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలుకి 4 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు.

న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదవ్వగా, దిశ ఎఫెక్ట్‌తో విచారణ వేగవంతంగా జరిగింది. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా వాదించిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement