ఉద్దానం జీవనాడి.. జీడి

Uddanam Famous For Cashew In Srikakulam District - Sakshi

వజ్రపుకొత్తూరు: ఉద్దానం పేరు చెబితే గుర్తుకువచ్చేవి రెండే రెండు. ఒకటి కొబ్బరి, రెండు జీడి. 1945కు ముందు నుంచే ఇక్కడ జీడి ఆధిపత్యం చూపడం మొదలుపెట్టింది. ఇక్కడ రైతాంగానికి జీడి జీవ నాడి. ఉద్దానంలో పండే జీడిపిక్కలు నాణ్యమైనవి. ఉత్పత్తి చేసే పప్పు పలుకు సైజు, లెక్కనుబట్టి నాణ్యత నిర్ణయిస్తారు. అత్యంత నాణ్యత కలిగిన జంబో క్వాలిటీ స్థానికంగా దొరకదు. ఉత్పత్తి అయిన మొత్తంలో జంబో జీడి పప్పు జాతీయ స్థాయిలో ఎగుమతి చేస్తారు. అమెరికన్‌ మార్కెట్‌లో 454 గ్రాములను ఒక పౌను అంటారు. ఒక పౌను జీడి పప్పు తూకం వేయగా వచ్చిన కౌంటు ప్రకారం వాటి నాణ్యతను నిర్ణయిస్తారు. అందులో భాగంగా జీడి పప్పును 16 రకాలుగా విభజిచారు. మొదటిది 180 రకం అంటే 180 గుడ్లు(పలుకులు). దీని ధర డిమాండ్‌ సమయంలో రూ.980 వరకు పలుకగా ప్రస్తుతం రూ.740గా ఉంది. ఈ రకంను ఎగుమతికి మాత్రమే సిద్ధం చేస్తారు.

స్థానికంగా దొరకదు. కోల్‌కత్తా, ముంబాయి, డిల్లీ, మద్రా సు, చత్తీస్‌గఢ్, ప్రాంతాలకు టిన్, పౌచ్‌ల రూపంలో ఎగుమతి చేస్తారు. ఇక పోతే 210 రకం ఇందులో కిలోకు 210 గుడ్లు తూకం వేస్తారు. ఇది ఎక్కువగా ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఇలా గుడ్లు బట్టి 240, 320, 400 రకాలను వివిధ ధరల్లో విక్రయిస్తారు. జేహెచ్‌ రకం అంటే బద్ద (గుడ్డులో సగం పలుకు) దీన్ని తిరుపతి శ్రీవారీ లడ్డూ ప్రసాదంలో వినియోగిస్తారు.  ఇది కాకుండా డబుల్‌ నంబర్‌ వన్, స్టాండర్డు బట్స్, జేహెచ్, కేఎల్‌ డబ్ల్యూపి, పీసెస్, ఎస్‌.ఎస్‌.డబ్ల్యూ, డి. డబ్ల్యూ, బి.బి, ఎస్‌.డబ్యూ.పీ, డీసీ తదితర రకాలు ఉన్నాయి. కుండల్లో కాల్చి(రోస్టింగ్‌) వలిచే జీడి పప్పుకు డిమాండ్‌ ఎక్కువ.     

ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి 
కొత్తూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వసప అనే ఊరొకటి ఉంది. కేవలం ఎనిమిది వందల మందే ఉంటారు. కానీ నిరంత రం ఆ ఊరికి వ్యాన్లు, బైకుల మీద చాలా మంది వస్తుంటా రు. కారణం చికెన్‌ బిర్యానీ.. అవును వసపలో వెంకటరావు అనే వ్యక్తి తయారు చేసే బిర్యానీని లొట్టలేసుకుని మరీ తింటా రు. శ్రీకాకుళం, ఆమదాలవల స, పాలకొండతో పాటు ఒడిశా లోని పర్లాకిమిడి, కాశీనగర్, గుణుపూర్‌ నుంచి కూడా ఎంతో మంది కేవలం బిర్యానీ తీసుకెళ్లడానికే ఈ ఊరికొస్తుంటారు.

గ్రామానికి చెందిన కె.వెంకటరావు ఉపాధి కోసం హైదరబాద్‌ వెళ్లి అక్కడ బిర్యానీ తయారు చేయడం చేర్చకుని అనంతరం ఇక్కడే హొటల్‌ పెట్టారు. బిర్యానీ రుచి అదిరిపోవడంతో చుట్టుపక్కల వారంతా ఫిదా అయిపోయారు. పిక్‌నిక్‌ సీజన్లలో ఒక రోజు ముందు ఆర్డర్‌ ఇస్తే గానీ బిర్యానీ దొరకదు. అధికారులు కూడా ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడి నుంచే బిర్యానీ తీసుకెళ్తుంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top