ఘోర ప్రమాదం: పోలీసులపై దూసుకెళ్లిన లారీ | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం: పోలీసులపై దూసుకెళ్లిన లారీ

Published Fri, May 14 2021 6:44 AM

Two Policemen Deceased In Road Accident - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: సామర్లకోట ఉండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోలింగ్ వెహికల్‌తో ఉన్న ఇద్దరు పోలీసులపై లారీ దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను తిమ్మాపురం పోలీసు స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మెండి సత్యనారాయణ, హోం గార్డు ఎన్ఎస్‌రెడ్డిగా గుర్తించారు. విజయవాడ నుంచి వచ్చే కోవిడ్ వ్యాక్సిన్‌ వాహనానికి ఎస్కార్ట్ విధుల కోసం ఉండూరు వంతెన వద్ద వేచి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

చదవండి: తుఫాన్‌ అలర్ట్‌: దూసుకొస్తున్న ‘తౌక్టే’
దారుణం: యువతిపై సామూహిక లైంగిక దాడి

Advertisement
 
Advertisement
 
Advertisement