తిరుమల: శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు | TTD Changes In Tirumala Srivani Tickets Issue Process | Sakshi
Sakshi News home page

తిరుమల: శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు

May 30 2026 9:19 AM | Updated on May 30 2026 9:25 AM

TTD Changes In Tirumala Srivani Tickets Issue Process

తిరుమల: భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రోజూ 1,500 శ్రీవాణి టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 500  టికెట్లను మూడు నెలల ముందుగా ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌ బుకింగ్‌ కింద అందుబాటులో ఉంచనుంది.

మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్‌ బుకింగ్‌ కింద జారీచేయనుంది. ప్రస్తుతం రోజువారీ కరెంట్‌ బుకింగ్‌ కోటాలో అందుబాటు­లో ఉన్న 800 శ్రీవాణి దర్శన టికెట్లలో ఇప్పటికే రూ.10 వేలు విరాళం చెల్లించి దర్శన టికెట్‌ కోసం వేచి ఉన్న దాతలకు ప్రతిరోజూ 300 టికెట్లు  కేటాయించాలని నిర్ణయించింది. ఈ సదుపాయం 2025 మే 1 నుంచి విరాళం చెల్లించిన అర్హులైన దాతలకు వర్తించనుంది. ఈ టికెట్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తుంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు బుక్‌ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కలి్పస్తుంది. కాగా ఈ విధానం జూన్‌ 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని టీటీడీ  పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement