
అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి బాలికను తీసుకెళ్లి విశాఖలో ఇద్దరి అత్యాచారం
కలెక్టర్‌కు ఫిర్యాదుతో వెలుగులోకి దారుణం
ఈ ఘటనపై సెప్టెంబర్ 13న ఫిర్యాదు చేసినా స్పందించని చింతపల్లి పోలీసులు
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గిరిజన నాయకులు
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
పాడేరు: కూటమి పాలనలో బాలికలు, మహిళలకు రక్షణ లేదనటానికి ఈ దారుణ సంఘటన మరో ఉదాహరణ. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు నాలుగు రోజులు అత్యాచారం చేశారు. ఈ దారుణంపై సెపె్టంబర్ 13న ఫిర్యాదు చేసినా చింతపల్లి పోలీసులు స్పందించలేదు. పాడేరు ఐటీడీఏలో శుక్రవారం కలెక్టర్ దినేష్ కుమార్‌కు బాధిత బాలిక ఫిర్యాదు చేసింది.
ఆ బాలికతో పాటు గిరిజన నాయకులు బాలకృష్ణ (కాంగ్రెస్), చంటిబాబు (సీపీఐ) తదితరులు కలెక్టరును కలిసి న్యాయం చేయాలని కోరారు. బాలిక ఫిర్యాదు మేరకు.. సెపె్టంబర్ 5న లంబసింగికి చెందిన తెలిసిన మహిళ బాలికకు మాయమాటలు చెప్పి తనవెంట తీసుకెళ్లింది. కొద్దిదూరం వెళ్లాక తోటమామిడికి చెందిన యువకుడి బైక్‌పై వారు నర్సీపట్నం వెళ్లారు. అక్కడి నుంచి జి.మాడుగుల మండలం వంజరికి చెందిన యువకుడి కారులో వీరు ముగ్గురు విశాఖపట్నం వెళ్లారు.
అక్కడ ఓ ఇంట్లో బాలికను బంధించి తోటమామిడి యువకుడు, వంజరి యువకుడు 3 రోజుల పాటు అత్యాచారం చేశారు. నాలుగో రోజు నర్సీపట్నం తీసుకొచ్చి లాడ్జిలో ఉన్నారు. అనంతరం లాడ్జి నిర్వాహకుడితో బాలికకు రూ.100 ఇప్పించి, అక్కడి నుంచి పరారయ్యారు. ఆ బాలిక సెపె్టంబర్ 12న కుటుంబ సభ్యులకు నర్సీపట్నం నుంచి ఫోన్ చేసి, జరిగిన దారుణాన్ని చెప్పడంతో తల్లిదండ్రులు సెపె్టంబర్ 13న చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తుల వివరాలను కూడా పోలీసులకు ఇచ్చారు. అయినా పోలీసులు రేపు, ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కలెక్టర్‌ను కోరారు. అనంతరం విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు.