శ్రీకాకుళం: గిరిజనులపై టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ దూషణలకు దిగారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే అశోక్‌ను కలిశారు గిరిజన సంఘం నేతలు. అసెంబ్లీలో ఆదివాసీల సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యేను కోరారు గిరిజనులు. అయితే వారిపై ఎమ్మెల్యే అశోక్ దూషణలకు దిగారు.
“బ్లడీ బాస్టర్డ్… మీరు నన్ను ప్రశ్నించడం ఏంటి?”, బుర్ర ఉండి మాట్లాడుతున్నారా? లేక బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా?, “ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ నా దగ్గరకు ఎందుకు వచ్చారు?’, నేను ఏం చేయాలో కూడా మీరు చెప్పాలా?, వాడెవడు నాకు చెప్పడానికి?, ఏం చేయాలో నేను చేస్తా’ అంటూ అవమానకర రీతిలో మాట్లాడారు.
టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనులపై బూతు పురాణం మాట్లాడిన ఘటనపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆయనపై మరింత అసంతృప్తి పెరిగింది.


