Ashok (23)
-
“ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ నా దగ్గరకు ఎందుకు వచ్చారు?’
శ్రీకాకుళం: గిరిజనులపై టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ దూషణలకు దిగారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే అశోక్‌ను కలిశారు గిరిజన సంఘం నేతలు. అసెంబ్లీలో ఆదివాసీల సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యేను కోరారు గిరిజనులు. అయితే వారిపై ఎమ్మెల్యే అశోక్ దూషణలకు దిగారు. “బ్లడీ బాస్టర్డ్… మీరు నన్ను ప్రశ్నించడం ఏంటి?”, బుర్ర ఉండి మాట్లాడుతున్నారా? లేక బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా?, “ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ నా దగ్గరకు ఎందుకు వచ్చారు?’, నేను ఏం చేయాలో కూడా మీరు చెప్పాలా?, వాడెవడు నాకు చెప్పడానికి?, ఏం చేయాలో నేను చేస్తా’ అంటూ అవమానకర రీతిలో మాట్లాడారు.టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనులపై బూతు పురాణం మాట్లాడిన ఘటనపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆయనపై మరింత అసంతృప్తి పెరిగింది. -
దెయ్యం పట్టిందని కొడుకును చంపేశాడు
జలదంకి: మూఢ నమ్మకంతో కన్నకొడుకునే ఓ తండ్రి కడతేర్చిన సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధారం చోటు చేసుకుంది. జలదంకి మండలం గట్టుపల్లికి చెందిన గోపిశెట్టి శ్రీనివాసులుకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు అశోక్ (23) ఐటీఐ చదివి ఇంటివద్ద ఉంటున్నాడు. సన్నకారు రైతైన శ్రీనివాసులుకు మూఢభక్తి ఎక్కువ. కుటుంబకష్టాలు గట్టెక్కేందుకు ఇటీవల ఓ స్వామీజీని ఆశ్రయించాడు. అశోక్‌కు దెయ్యం పట్టిందని, కాళ్లు చేతులు కట్టివేసి నోట్లో గుడ్డలు పెట్టి పొట్టపై ఒత్తాలని.. అప్పుడు నీకు కూడా ఒంట్లోకి దేవుడు వచ్చి మీ కుమారుడికి దెయ్యం వదులుతుందని, కుటుంబం బాగుపడుతుందని అతను చెప్పినట్లు సమాచారం. దీంతో శ్రీనివాసులు భార్య మాధవి, రెండో కుమారుడిని ఒప్పించి అశోక్‌ను తాళ్లతో కట్టి నోట్లో గుడ్డలు పెట్టి పొట్టపై గట్టిగా ఒత్తారు. దీంతో అశోక్‌కు ఊపిరాడక మృతి చెందాడు. అనంతరం హడావుడిగా అశోక్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


