
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో పచ్చ నేతల బరితెగింపు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అసభ్యకర నృత్యాలు చేస్తూ టీడీపీ నేతలు హల్‌చల్ చేశారు.
వివరాల ప్రకారం.. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం సోమగట్ట గ్రామం శ్రీ మధుగిరి లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ సందర్బంగా టీడీపీ నేతలు హల్‌చల్ చేశారు. బ్రహ్మోత్సవాల్లో టీడీపీ నేతలు అసభ్యకరంగా నృత్యాలు చేశారు. రికార్డింగ్ డాన్సర్లతో కలిసి టీడీపీ నేత తిప్పారెడ్డి స్టెప్పులు వేశారు. దీంతో, టీడీపీ నేత తీరుపై భక్తులు మండిపడుతున్నారు. దేవుడి బ్రహ్మోత్సవాల్లో ఇలాంటి పనులేంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతల ఓవరాక్షన్ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.