
విజయనగరంలో క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి కంది మురళీనాయుడు
ఇదీ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతిపక్ష టీడీపీ నేతల తీరు. దీంతో ప్రలోభాలకు తెరతీశారు.
విజయనగరం: కార్పొరేషన్ హోదా.. తొలిసారి మేయర్ పీఠం.. ఈ అవకాశం ఎలాగైనా దక్కించుకోవాలి. ఇదీ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతిపక్ష టీడీపీ నేతల తీరు. దీంతో ప్రలోభాలకు తెరతీశారు. కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ బీసీ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ సమీపంలో స్థానిక యువతకు ఆదివారం ఉదయం 9.30 గంటలకు టీడీపీ అభ్యర్థి కంది మురళీనాయుడు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఓ వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పచ్చనేతలు ఇటువంటి చర్యలకు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: పులివెందుల ‘పంచ్’ అదిరింది
ముక్కు మూసుకున్న అధికారులు: ‘నారాయణ’పై సీరియస్