ఫార్మా విద్యార్థినిపై టీడీపీ కార్యకర్త అఘాయిత్యం | Shocking Incident In AP, TDP Activists Harassment On Pharmacy Student In Anantapur, Accused Arrested | Sakshi
Sakshi News home page

ఫార్మా విద్యార్థినిపై టీడీపీ కార్యకర్త అఘాయిత్యం

May 31 2026 5:38 AM | Updated on May 31 2026 12:04 PM

TDP Activists Harassment on Pharmacy Student: Andhra pradesh

నారా లోకేశ్‌తో టీడీపీ కార్యకర్త కొక్కంటి హరి (ఫైల్‌) , పరిటాల శ్రీరామ్‌తో హరి (ఫైల్‌)

లైంగిక దాడికి యత్నించిన టీడీపీ కార్యకర్త కొక్కంటి హరి 

అనంతపురంలోని వనమిత్ర పార్కులో ఘాతుకం 

ఆలస్యంగా వెలుగులోకి ..

ధర్మవరం: అనంతపురం జిల్లా కేంద్రంలో మహిళలపై తెలుగు తమ్ముళ్ల అకృత్యాలు పెచ్చుమీరుతు­న్నాయి. టీడీపీ కార్యకర్తలు ఏకంగా పోలీసులమని చెప్పుకుని జనాన్ని బెదిరిస్తూ అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలోనే పార్కులో ఉన్న ఫార్మా విద్యార్థినిపై టీడీపీ కార్యకర్త కొక్కంటి హరి లైంగికదాడికి యత్నించాడు. ఈ దురాగతం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. బాధిత విద్యార్థిని ధై­ర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సద­రు టీడీపీ కార్యకర్త కటకటాలపాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 26న అనంతపురం రూరల్‌ పరిధిలోని టీవీ టవర్‌ వద్ద ఉన్న వనమిత్ర పార్కులో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫార్మసీ కళాశాలలో చదువుతున్న యువతి, ఆమె స్నే­హితుడు మాట్లాడుకుంటున్నారు.

అదే సమ­యంలో ధర్మవరానికి చెందిన టీడీపీ కార్యకర్త కొ­క్కంటి హరి అక్కడికి వెళ్లాడు. ‘మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? మేం పోలీసులం. విచారణ చే­యాలి. స్టేషన్‌కు రండి’ అంటూ భయపెట్టే యత్నం చేశాడు. దీంతో ఆ విద్యార్థులు తా­మేం తప్పు చేశామని ప్రశ్నించారు. ఇంతలో టీడీపీ కార్యకర్త హరి యు­వతిని బలవంతంగా పార్కు ముళ్ల­పొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె స్నేహితుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి ఉడాయించా­డు.

మరుసటి రోజు ఉద­యం బాధితురాలు అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు హరిని అరెస్టు చేశారు. లైంగికదాడియత్నం కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించారు. కాగా.. ధర్మవరం పట్టణంలోనూ టీడీపీ కార్యకర్త హరి అనేక ఆగడాలకు ఒడిగట్టాడు. మంత్రి నారా లోకే­శ్, పరిటాల శ్రీరామ్, ఇతర నాయకులకు హరి స­న్నిహితుడని సమాచారం. వారి అండతో అనేక దౌ­ర్జ­న్యాలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement