
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,486 మంది స్వామిని దర్శించుకున్నారు. 30,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.85 కోట్లు సమర్పించారు.
టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది.