
కొత్త మార్గదర్శకాలు విడుదల ముఖ్యమైన మార్పులు
మొదటి సెమిస్టర్ నుంచే రెండు మేజర్ సబ్జెక్టులు
మూడో సెమిస్టర్‌లో మైనర్ కోర్సు ఎంపిక అవకాశం
పూర్తి నాలుగేళ్ల డిగ్రీకి 194 క్రెడిట్లు, మూడేళ్లలో నిష్క్రమిస్తే 150 క్రెడిట్లు
తప్పనిసరి 10 నెలల ఇంటర్న్‌షిప్‌కు 16 క్రెడిట్లు
నైపుణ్య వృద్ధి, వాల్యూ యాడెడ్ కోర్సులకు ప్రత్యేక గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సంప్రదాయ డిగ్రీ విద్యలో నాలుగేళ్ల డ్యుయల్ మేజర్ ప్రోగ్రామ్ అమలుకు ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. డిగ్రీ విద్యలో సింగిల్ మేజర్ విధానాన్ని మార్పు చేసింది. ఇప్పుడు విద్యార్థులు మొదటి సెమిస్టర్ నుంచే రెండు మేజర్ సబ్జెక్టులను అభ్యసించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలు...
» మేజర్–1లో 12 కోర్సులు, మేజర్–2లో 8 కోర్సులు ఉంటాయి.
» ఆనర్స్ డిగ్రీ (4 ఏళ్ల డిగ్రీ) కోసం మేజర్–1తో పాటు 6 కోర్ కోర్సులు, అందులోనూ 4 నైపుణ్య వృద్ధి కోర్సులు తప్పనిసరిగా పూర్తి చేయాలి.
» మైనర్ కోర్సులు మూడో సెమిస్టర్‌లో ఎంపిక చేసుకోవచ్చు.
» రెండవ మైనర్ కోర్సును ఆన్‌లైన్ ద్వారా చదివే వెసులుబాటు ఉంది.
» కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్స్ అనుబంధ మేజర్లతో (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మైనింగ్, మెషిన్ లెర్నింగ్) చదివే విద్యార్థులకు క్వాంటం టెక్నాలజీస్‌లో మైనర్ తప్పనిసరి.
» మైనర్ కోర్సులను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్, బ్లెండెడ్ మోడ్‌లో చేసుకోవచ్చు.
» నైపుణ్య వృద్ధి కోర్సులను కాలానుగుణంగా విశ్వవిద్యాలయాలు చేర్చుకునే వెసులుబాటు ఉంది.
