నెల్లూరు: పెన్నా నదిలో చిక్కుకున్న ఐదుగురు | Some Trapped in Nellore Penna river Officials Rescue Actions | Sakshi
Sakshi News home page

నెల్లూరు: పెన్నా నదిలో చిక్కుకున్న ఐదుగురు.. అధికారుల్లో టెన్షన్‌

Dec 10 2022 11:53 AM | Updated on Dec 10 2022 11:54 AM

Some Trapped in Nellore Penna river Officials Rescue Actions - Sakshi

పెన్నా నది పరివాహకంలో శనివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది.. కొందరు నదిలోకి వెళ్లడం.. 

నెల్లూరు: పెన్నా నదిలో శనివారం ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. నది మధ్యలో ఇసుకదిబ్బపై వాళ్లు ఉండడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. 

సాక్షి టీవీ సమాచారంతో స్పందించిన అధికారులు .. పెన్నా బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. తహసీల్దార్‌తో పాటు పోలీసులు కూడా వచ్చారు. చిక్కుకున్న వాళ్లను మత్యకారులుగా భావిస్తున్నారు. బోట్ ద్వారా వాళ్లను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సోమశిల నుంచి పెన్నాకు నీటిని విడుదల చేయటంతోనే వాళ్లు అలా చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు తమ హెచ్చరికలు పట్టించుకోకుండా వాళ్లు నదిలోకి వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement