గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆస్పత్రి పైనుంచి దూకడంతో మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్ (50) తాపీ మేస్త్రి.
ఇతను కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఈనెల 23న జీజీహెచ్‌లో అడ్మిట్ అయ్యాడు. శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు 329వ వార్డులోకి వెళ్లి బాత్రూము కిటికీపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అవుట్‌పోస్టు పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కొత్తపేట పోలీసులకు సమాచారం అందజేశారు.


