
గుంటూరు: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యారు. గుంటూరు జైలు నుంచి సోమవారం సాయంత్రం( జూన్ 16) ఆయన విడుదలయ్యారు. సాక్షి ఛానెల్ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అక్రమ కేసు బనాయించిన గుంటూరు తుళ్లూరు పోలీసులు.. కొమ్మినేనిని అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టుపై శుక్రవారం(జూన్ 13) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలంటూ బెయిల్ మంజూరు చేసింది.
కాగా, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ పీకే మిశ్రా, జస్టిన్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం గత శుక్రవారం విచారణ జరిపింది. ‘‘టీవీ డిబేట్‌లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం?. ఆయన్ని వెంటనే విడుదల చేయండి’ అని సృష్టం చేసిన ద్విసభ్య ధర్మాసనం.. బెయిల్‌ను మంజూరు చేసింది.