దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ జీఎంగా సందీప్‌ మాథుర్‌ బాధ్యతలు | Sandeep Mathur appointed General Manager of SCoR | Sakshi
Sakshi News home page

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ జీఎంగా సందీప్‌ మాథుర్‌ బాధ్యతలు

Jun 15 2025 3:21 AM | Updated on Jun 15 2025 3:21 AM

Sandeep Mathur appointed General Manager of SCoR

తాటిచెట్లపాలెం (విశాఖ): దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌గా సందీప్‌ మాథుర్‌ శనివారం విశాఖలోని దొండపర్తిలో ఉన్న డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌బోరాతో కలిసి పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. జోనల్‌ కార్యకలాపాలపై భవిష్యత్తులో చేపట్టాలి్సన ప్రణాళికలను గురించి వివరించారు. ఈ సమావేశంలో సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఓఎస్డీ చంద్రశేఖర్, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (కన్‌స్ట్రక్షన్‌ ) అంకుష్‌ గుప్తా ఇతర ఉన్నతాధికారులతో  ఆయన పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement