ఏపీ: మినీ బ్యాంకులుగా రైతు భరోసా కేంద్రాలు 

Rythu Bharosa Centres Also Serve As Mini Banks In AP - Sakshi

రూ.20 వేల వరకు నగదు విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్‌ సదుపాయం

బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా లావాదేవీలు  

రూ.20 వేల వరకు నగదు విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్‌ సదుపాయం బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా లావాదేవీలు సామాన్యుడికి బ్యాంకింగ్‌ సేవలు మరింత చేరువయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన రైతుభరోసా కేంద్రాలు ఇందుకు వేదికగా మారాయి. రూ.20 వేలు వరకూ విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్, డిపాజిట్‌ వంటి సేవలను ఆర్‌బీకేలలోనే పొందేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతుభరోసా కేంద్రాలను మినీ బ్యాంకులుగా తీర్చిదిద్దారు.

శ్రీకాకుళం అర్బన్‌: వ్యవసాయ, అనుబంధ సేవలను రైతులకు దిగ్విజయంగా అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు మినీ బ్యాంక్‌లుగానూ సేవలందిస్తున్నా యి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం ఐదు వేల జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంక్‌ లు బ్రాంచ్‌లు నెలకొల్పాలి. అయితే బ్రాంచీల ఏర్పా టు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో బ్యాంకులు బిజినెస్‌ కరస్పాండెంట్లను నియమించుకుని సేవలు అందిస్తున్నాయి. అయితే అన్ని గ్రామాల్లోనూ బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌బీకేలలో బిజినెస్‌ కరస్పాండెంట్‌ల ద్వారా సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. (చదవండి: నిరాడంబరతకు ఆయనో నిలువుటద్దం)

ఇదీ పరిస్థితి.. 
గ్రామాల్లో చిన్న మొత్తం నుంచి రూ.20వేలు వరకూ విత్‌డ్రా చేయాలన్నా, జమ చేయాలన్నా, నగదు బదిలీ చేయాలన్నా సమీపంలో ఉన్న బ్యాంక్‌లకు వెళ్లాల్సి వచ్చేది. తాజాగా బిజినెస్‌ కరస్పాండెంట్‌లను ఏర్పాటు చేయడంతో గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్లి లావాదేవీలు జరుపుకొంటున్నారు. గత నెల 9 నుంచి ఆర్‌బీకేల్లోనే బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్నారు. దీని కోసం లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ (ఎల్‌డీఎం) ఏర్పాట్లు చేశారు.

రూ.20వేల వరకూ లావాదేవీలు.. 
ఆర్‌బీకేలలో నగదు ఉపసంహరణ, జమతోపాటు నగదు బదిలీ చేసుకునే అవకాశం కూడా అందుబాటులో ఉంది. ఇందుకు బిజినెస్‌ కరస్పాండెంట్ల సేవలు వినియోగించుకోవచ్చు. వీరి పనివేళలను కూడా త్వరలోనే నిర్ణయించనున్నా రు. బ్యాంక్‌లు ఇచ్చిన స్వైపింగ్‌ మెషీన్లు, ట్యాబ్‌ల ద్వారా కరస్పాండెంట్లు లావాదేవీలు నిర్వహిస్తున్నారు.

బ్యాంకింగ్‌ సేవలు ఉచితం.. 
రైతు భరోసా కేంద్రాలలో బిజినెస్‌ కరస్పాండెంట్లు అందించే బ్యాంకింగ్‌ సేవలు పూర్తిగా ఉచితం. ఈ మేర కు అన్ని బ్యాంక్‌లకు ఆదేశాలు పంపించాం. ప్రస్తుతం ఉన్న 635 మందితో పాటు మరో 200 మంది బిజినెస్‌ కరస్పాండెంట్ల ను నియమించాల్సి ఉంది. వీరితో ఆర్‌బీకేల మ్యాపింగ్‌ చేయడం పూర్తయింది. ఈ సేవలను రైతులు, డ్వాక్రా మహిళలు, పెన్షనర్లతోపాటు అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చు.  
– జి.వి.బి.డి.హరిప్రసాద్, ఎల్‌డీఎం

ఉపయోగకరం 
ఆర్‌బీకేలను మినీ బ్యాంక్‌లుగా మార్చి రైతులు నగదు లావాదేవీలు నిర్వహించుకు నేలా చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎరువులు, విత్తనాలతో పాటు నగదు లావాదేవీలు కూడా నిర్వహించడం సంతోషకరం. దీనివల్ల రైతులకు సమయం ఆదా అవ్వడంతోపాటు దూర ప్రాంతాలకు వెళ్లే బాధ తప్పుతుంది.  
– లుకలాపు ఆదినారాయణ, రైతు, నందివాడ  

ఇబ్బందులు తప్పాయి.. 
గతంలో బ్యాంకు సేవల కోసం 3 నుంచి 5 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. ఇపుడు రైతుభరోసా కేంద్రాన్నే మినీ బ్యాంక్‌లుగా ఏర్పాటు చేసి బిజినెస్‌ కరస్పాండెంట్ల సహాయంతో నగదు లావాదేవీలు నిర్వహించడం సంతోషంగా ఉంది.   
– వి.పోలివాడు, రైతు, విజయరాంపురం

ఇవీ చదవండి: 
వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్‌.. కొనసాగుతున్న చికిత్స 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top