ఆర్సీబీ విజయం.. తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపుతున్న ఫ్యాన్స్‌ | RCB Fans Celebrations in Hyderabad and Vijayawada | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ విజయం.. తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపుతున్న ఫ్యాన్స్‌

Jun 1 2026 12:39 AM | Updated on Jun 1 2026 12:44 AM

RCB Fans Celebrations in Hyderabad and Vijayawada

ఐపీఎల్‌ ఫైనల్‌లో ఆర్సీబీ  విజయంతో తెలుగురాష్ట్రాల్లో ఫ్యాన్స్‌ హంగామా మెుదలైంది. ఆర్సీబీ విజయంతో హైదరాబాద్‌లో సంబరాలు మెుదలయ్యాయి. ఆ జట్టు అభిమానులు పెద్ద సంఖ్యలో ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. అక్కడ టపాసులు పేల్చి సంబురాలు జరిపారు.  ఆర్సీబీకి మద్దతుగా నినాదాలు చేస్తూ ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో హోరెత్తించారు.

మరోవైపు ఆర్సీబీ గెలుపుతో విజవాడలోనూ ఫ్యాన్స్‌ సంబురాలు చేసుకున్నారు. రోడ్లపైకి వచ్చి ఆర్సీబీ విక్టరీ నినాదాలతో హోరెత్తించారు. కాగా కేవలం ఆర్సీబీకీ కేవలం కర్ణాటకలోనే కాకుండా  దేశవ్యాప్తంగా భారీగా అభిమానులున్నారు. దీంతో సెలబ్రేషన్స్ హోరెత్తిస్తున్నారు. కాగా ఈ రోజు జరిగిన ఫైనల్‌ మ్యాచులో గుజరాత్‌ టైటాన్స్ నిర్దేశించన టార్గెట్‌ను ఆర్సీబీ అలవోకగా ఛేదించింది. దీంతో వరుసగా రెండో సారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement