ల్యాబ్‌లు పరీక్షల ధరలు తగ్గించాలని ఆదేశం

Private Labs Should Reduction Covid 19 Test Price Order Issued By AP Govt - Sakshi

సాక్షి, అమరావతి: ప్రైవేటు ల్యాబరేటరీల్లో కోవిడ్‌-19 పరీక్షలకు వసూలు చేసే ధరల్ని సవరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌ఏబీఎల్‌, ఐసీఎంఆర్‌లు అనుమతించిన ప్రైవేటు ల్యాబరేటరీల్లో పరీక్షలకు వసూలు చేసే ధరలనూ సవరిస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు పంపింది. ఆర్‌ఎన్‌ఏ కిట్లు, ఆర్టీపీసీఆర్‌ కిట్లు పూర్తి స్థాయిలో మార్కెట్లో అందుబాటులోకి రావడంతో పరీక్షల కోసం వసూలు చేస్తున్న ధరలను తగ్గించాని ఆదేశించింది. ప్రభుత్వం పంపించే నమునాలను 800 రుపాయలకు మాత్రమే వసూలు చేయాలని సూచిస్తూ ల్యాబ్‌ నిర్వహకులను ఆదేశించింది. వచ్చే నమునాలకు 1000 రూపాయల వరకూ వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top