సీఎం జగన్‌ను కలిసిన  మాజీ ఎంపీ పొంగులేటి | Ponguleti Srinivasareddy Meets CM YS Jagan at Tadepalli | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన  మాజీ ఎంపీ పొంగులేటి

Jun 11 2022 7:14 AM | Updated on Jun 11 2022 3:00 PM

Ponguleti Srinivasareddy Meets CM YS Jagan at Tadepalli - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌తో శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి  

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్‌.. బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

మధిర: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శుక్రవారం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కలుపుతూ ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం సమీపంలోని కట్టలేరుపై ఉన్న బ్రిడ్జి నాలుగేళ్ల కిందట వరద ఉధృతికి కొట్టుకుపోయిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్‌.. బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. జగన్‌ను కలిసిన వారిలో భద్రాచలం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్‌ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి కూడా ఉన్నారు.

చదవండి: (ఊపందుకుంటున్న ‘ఊళ్లు’) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement