ఏడో తరగతి బాలుడిపై లైంగికదాడి | POCSO case against five ninth grade students | Sakshi
Sakshi News home page

ఏడో తరగతి బాలుడిపై లైంగికదాడి

Nov 13 2025 5:06 AM | Updated on Nov 13 2025 5:06 AM

POCSO case against five ninth grade students

ఐదుగురు తొమ్మిదో తరగతివిద్యార్థులపై పోక్సో కేసు 

శ్రీకాకుళం జిల్లాలో ఘటన 

రణస్థలం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జేఆర్‌ పురం పంచాయతీలోని ప్రభుత్వ వసతి గృహంలో 7వ తరగతి చదువుతున్న బాలుడిపై అదే హాస్టల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఐదుగురు బాలురు లైంగిక దాడికి పాల్పడినట్లు జేఆర్‌ పురం పోలీసులు తెలిపారు. 

ఈ నెల 6న రాత్రిపూట ఐదుగురు బాలురు బాధిత బాలుడుపై అకృత్యానికి పాల్పడ్డారు. దీంతో అప్పటి నుంచి బాధిత బాలుడికి రక్తస్రావం అవుతుండడంతో బుధవారం రణస్థలం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఆరా తీయగా జరిగిన విషయం చెప్పాడు. 

దీంతో వారు జేఆర్‌ పురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అతన్ని శ్రీకాకుళంలోని మరో ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎస్‌. చిరంజీవి నిందితులు ఐదుగురిపై పోక్సో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement