ప్రపంచ స్థాయికి ‘నాసిన్‌’ కీర్తి | PM Modi Inaugurates New Campus of National Academy of Customs in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ప్రపంచ స్థాయికి ‘నాసిన్‌’ కీర్తి

Jan 17 2024 3:07 AM | Updated on Jan 17 2024 7:27 AM

PM Modi Inaugurates New Campus of National Academy of Customs in Andhra Pradesh - Sakshi

సాక్షి, పుట్టపర్తి: అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రపంచస్థాయి సంస్థ ‘నాసిన్‌’ అకాడమీని నెలకొల్పినందుకు ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలియచేశారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ (నాసిన్‌) అకాడమీ ప్రారంభోత్సవంలో సీఎం జగన్‌ ప్రధానితో కలసి పాల్గొన్నారు.

‘నాసిన్‌’ను తీసుకొచ్చే గొప్ప ప్రయత్నం చేయడమే కాకుండా పట్టుబట్టి సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పలు సందర్భాలలో ఇక్కడికి రావడం మన కళ్లెదుటే కనిపించిన వాస్తవమన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ మన రాష్ట్రం పేరు, కీర్తి ప్రతిష్టలను దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్నింటిని అనుసంధానించే గొప్ప సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement