ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత.. భారీ క్యూలైన్‌.. | Petrol And Diesel Crisis In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత.. భారీ క్యూలైన్‌..

Apr 25 2026 12:31 PM | Updated on Apr 25 2026 3:31 PM

Petrol And Diesel Crisis In AP

సాక్షి, కర్నూలు: ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. డీజిల్‌ కొరత తీవ్రతరం కావడంతో పెట్రోల్‌ కూడా దొరుకుతుందో లేదో అనే భయంతో లీటర్ల కొద్దీ పెట్రోల్‌ తీసుకువెళ్తున్నారు. బంకుల వద్ద గంటల తరబడి పెట్రోల్‌ కోసం వాహనదారులు బారులు తీరారు.

కర్నూలులో పెట్రోల్, డీజిల్ కొరత

  • పెట్రోలు బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో ఆందోళన చెందుతున్న వాహనదారులు

  • పెట్రోలు దొరకదు అనే భయంతో వాహనదారుల్లో టెన్షన్‌.  

  • గంటల కొద్దీ పెట్రోల్ కోసం ఖాళీ బాటిల్స్‌లో వాహనదారుల బారులు.

  • పెట్రోల్, డీజిల్ కోసం ఆందోళన చెందుతున్న‌ వినియోగదారులు.

  • తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరుతున్న వాహనదారులు.


    స్పందించిన కర్నూలు కలెక్టర్
    పెట్రోలు కొరతపై స్పందించిన కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్  సిరి స్పందిస్తూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న  166 పెట్రోల్ బంకుల్లో 13 లక్షల లీటర్ల పెట్రోల్, 11 లక్షల లీటర్ల డిజిల్ అందుబాటులో ఉందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ దొరకదని భయంతో ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తున్నారని, దీంతో బంకులు ఖాళీ అవుతున్నాయ‌ని.. ఫ‌లితంగా 32 బంకులు మూత‌ప‌డ్డాయ‌ని చెప్పారు. అక్రమంగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. 

  • బంకుల వద్ద భారీ క్యూలు.. గంటల కొద్దీ వెయిటింగ్


నందిగామలో డీజిల్ కొరత..

  • డీజిల్ కొరత కారణంగా నందిగామలో సామాన్యుల అవస్థలు

  • బంకుల వద్ద బారులు తీరుతున్న వాహనాలు

  • కొన్ని బంకుల్లో రేషన్ పద్దతిలో డీజిల్..

  • కారుకి 10, లారీకి 50 లీటర్లు మాత్రమే..

  • నిన్నటి నుండి బంకుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న వాహనదారులు

  • రెండు గంటలపైన వాహనం లైన్‌లో ఉండే 15 లీటర్లు మాత్రమే కొడుతున్నారంటూ వాహనదారుల ఆవేదన

  • డీజిల్ కొరత నేపధ్యంలో కొన్ని బంకుల్లో టిన్నుల్లో డీజిల్ కొట్టించుకుంటున్న వాహనదారులు

  • డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నామని వాహనదారుల ఆవేదన.
     

    మచిలీపట్నంలోనూ బారులు

  • మచిలీపట్నం పలు పెట్రోల్ బంక్ లలో డీజీల్  కొరత
  • మచిలీపట్నంలోని రెండు బంక్ లలో మాత్రమే దొరుకుతున్న డీజిల్
  • రెండు బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు
  • ఆంక్షలు విధించి వాహనాలలో డీజిల్ నింపుతున్న బంక్ సిబ్బంది
  • పలుచోట్ల పెట్రోల్ బంకు సిబ్బందితో వాగ్వివాదానికి దిగిన వాహనదారులు

 

కాకినాడ జిల్లా

  • డీజిల్‌ కోసం పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్న వాహనదారులు

  • పలు బంకుల వద్ద క్యూ లైన్‌లో ఆటోలు

  • కొన్ని బంకులలో 2 లీటర్లే కొట్టడంతో ఆవేదన చెందుతున్న ఆటో డ్రైవర్లు.

  • ప్లాస్టిక్ టిన్నుల్లో డీజిల్‌ కొట్టించుకుంటున్న వినియోగదారులు

  • డీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్న మాటలకు, బంకుల వద్ద పరిస్ధితికి పొంతన లేదని మండిపడుతున్న ఆటో డ్రైవర్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement