చంద్రబాబుదే షాక్‌.. సబ్సిడీలకు బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

చంద్రబాబుదే షాక్‌.. సబ్సిడీలకు బ్రేక్‌

Published Wed, Mar 20 2024 5:40 AM

Payment of subsidy arrears only during Jagans government - Sakshi

ఐదేళ్ల వ్యవధిలో ప్రభుత్వ సబ్సిడీలు పూర్తిగా ఇవ్వని చంద్రబాబు 

జగన్‌ ప్రభుత్వ హయాంలోనే సబ్సిడీ బకాయిల చెల్లింపు 

ఇతర రాష్ట్రాల్లోనూ గృహ వినియోగదారులకు స్థిర చార్జీలు   

సబ్సిడీ కేటగిరీల వినియోగదారులకు అన్ని చార్జీలను చెల్లిస్తున్న ప్రభుత్వం 

వాస్తవాలు దాచి ‘ఈనాడు’ అడ్డగోలు అబద్ధాలతో బురద కథనం 

చంద్రబాబు చేసిన తప్పులను, పాపాలను ఏ రోజూ అచ్చేయని రామోజీకి గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వంలో ఒప్పులు సైతం తప్పులుగానే కనిపిస్తున్నాయి. తానేం రాసినా ఈ రాష్ట్ర ప్రజానీకం నమ్మేస్తుందనే వెర్రి భ్రమల్లోంచి ఈ గురివింద బయట పడడం లేదు. వాస్తవాలను అచ్చేయడానికి ఈ పెద్దమనిషికి చేతులు రావడం లేదు. రోజూ అభూతకల్పనలతో పత్రిక స్థాయిని ఎంతగా దిగజార్చుకోవాలో అంతగా దిగజారుస్తూ పాత్రికేయ విలువలకు వలువలూడదీస్తున్నారు.

రికార్డు పరంగా ఉన్న నిజాలను సైతం అబద్ధాలుగా వక్రభాష్యాలతో అచ్చేస్తూ పత్రికను టీడీపీ కరపత్రికగా మార్చే  బరితెగింపు రామోజీకి మాత్రమే సాధ్యమైంది. విద్యుత్‌ చార్జీల విషయంలో ఐదేళ్ల వ్యవధిలో ఏ రోజూ ప్రభుత్వ సబ్సిడీలు ఇవ్వని చంద్రబాబు రామోజీ దృష్టిలో గొప్ప పాలకుడు.

రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్న వైఎస్‌ జగన్‌ మాత్రం నచ్చని పాలకుడు. బొక్కబోర్లా పడిన టీడీపీని ఎలాగైనా నిలబెట్టాలని తెగ ఆరాట పడిపోతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘ఐదేళ్లూ షాక్‌.. ఎన్నికలని బ్రేక్‌’ శీర్షికతో ఈనాడులో అచ్చేసిన కథనంలో నిజానిజాలు ఇలా ఉన్నాయి.  – సాక్షి అమరావతి

ఆరోపణ: 2021–22లో వినియోగించిన విద్యుత్తుకు ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.3,082.99 కోట్ల భారం 
వాస్తవం : 2021–22లో వినియోగించిన విద్యుత్తుకు వాస్తవ, ఆమోదిత విద్యుత్తు కొనుగోలు ఖర్చులోని వ్యత్యాసాన్ని వసూలు చేస్తోంది. ఆ వసూలు భారం లేనిదే. ప్రతి యూనిట్‌కు కేవలం రూ.0.6455 పైసలు మాత్రమే వసూలు చేస్తోంది. ఇందులోనూ ప్రభుత్వ ప్రమేయం లేదు. పైగా ప్రభుత్వం సబ్సిడీ చెల్లించే కేటగిరీల వినియోగదారులకు ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. 

ఆరోపణ: జగన్‌ ప్రభుత్వం నెలకు 500 యూనిట్లు వినియోగించే వినియోగదారులపై యూనిట్‌కు 90 పైసలు పెంచింది
వాస్తవం :  ఏటా విద్యుత్తు చార్జీల టారిఫ్‌పై ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి  పంపిణీ సంస్థలు సమర్పిస్తాయి. ఏపీఈఆర్‌సీ బహిరంగ విచారణ నిర్వహించి, ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చేలా కొత్త టారిఫ్‌ ప్రకటిస్తుంది. అంటే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నెల రోజుల ముందే టారిఫ్‌ అమలులోకి వచ్చింది.

అలాంటప్పుడు ఆ చార్జీలను కొత్త ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది ? ఎలా పెంచుతుంది? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వార్తలెలా రాస్తున్నారు డ్రామోజీ? చంద్రబాబు హయాంలోనే పెంచిన చార్జీలను జగన్‌ ప్రభుత్వంపై రుద్దడానికి ఇంత కన్నా మార్గం కనిపించలేదా? నాలుగేళ్లుగా ఈ చార్జీలు కొనసాగుతున్నాయంటే 500 యూనిట్ల పైన వినియోగించే వారంటే కచ్చితంగా పేదలు కాదని రామోజీకి తెలియదా?

ఆరోపణ: 2023 ఏప్రిల్‌ నుంచి ప్రతినెలా విద్యుత్తు కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చును ఇంధన సర్దుబాటు చార్జీల  పేరుతో వసూలు చేస్తోంది.
వాస్తవం :  2023–24కు సంబంధించి విద్యుత్తు   కొనుగోలు ట్రూ–అప్‌ (విద్యుత్తు కొనుగోలు వ్యయం, సర్దుబాటు)కు ఏపీఈఆర్‌సీ రెగ్యులేషన్‌–2 ప్రకారం ఏప్రిల్‌ నెల వినియోగానికి ఎఫ్‌ఏపీసీఏ మొత్తాన్ని జూన్‌లో వసూలు చేయాలి. అదీ యూనిట్‌కు గరిష్టంగా రూ.0.40 పైసలు వరకు మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించింది. ఇందులో వ్యవసాయ, ఇతర సబ్సిడీ వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. 

ఆరోపణ : గృహ, ఎల్‌టీ వాణిజ్య వినియోగదారులపై స్థిర చార్జీల భారం
వాస్తవం :  గృహ వినియోగ కేటగిరీలో అంతకు ముందు విధిస్తున్న కనీస వినియోగ చార్జీలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. నిజానికి గృహ కేటగిరీలో స్థిరచార్జీలు ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. కర్ణాటకలో కిలోవాట్‌కు రూ.110 తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో సింగిల్‌ ఫేజ్‌కు రూ.110, త్రీ ఫేజ్‌కు రూ.385 వసూలు చేస్తున్నారు. కేరళలో సింగిల్‌ ఫేజ్‌కు రూ.40 నుంచి రూ.260 వరకూ, త్రీఫేజ్‌కు రూ.100 నుంచి రూ.200 వరకూ  విధిస్తున్నారు.

2021–22 ఆర్థిక సంవత్సరానికి ముందు ఒక్కో సర్వీసుకు నెలవారీ కనీస చార్జీల మొత్తం రూ.25గా ఉండేది. ఆ తర్వాత 2021 ఏప్రిల్‌లో ఆ కనీస చార్జీని ఒక్కో కిలోవాట్‌కు రూ.10లుగా నిర్ణయిస్తూ రాష్ట్ర విద్యుత్తుæ నియంత్రణా మండలి  ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థిర చార్జీలను డిస్కంకు విద్యుత్తుæ ప్రసార, పంపిణీ వ్యవస్థ (íపీజీసీఐల్, ట్రాన్సిమిషన్, డిస్ట్రిబ్యూషన్‌)కు అయ్యే వ్యయం, విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన స్థిర వ్యయంలో కొంత భాగాన్ని రికవరీ చేసుకోవడం కోసం విధిస్తున్నారు.

ఇది గృహేతర కేటగిరీల్లో ముందు నుంచి వసూలు చేస్తున్నదే. వాస్తవానికి సుమారు 67 శాతం సర్వీసులు ఒక కిలోవాట్, అంతకంటే తక్కువ లోడ్‌ పరిధిలోనే ఉంటాయి. అందువల్ల ఒక్కో సర్వీసుపైన విద్యుత్తుæ సంస్థలు దాదాపు రూ.15 నష్టాన్ని భరిస్తున్నాయి. ఇందులో ప్రజలపై భారం వేసిందేముంది? ప్రభుత్వం తీసుకున్నదేముంది?

ఆరోపణ: 2014–19 మధ్య ట్రూ–అప్‌ కింద ఇప్పటికే రూ.1,455.37 కోట్లు వసూలు
వాస్తవం : 2014–15 నుంచి 2018–19 వరకు ఆమోదించిన దానికి వాస్తవ పంపిణీ ఖర్చు (నిర్వహణ వ్యయం, తరుగుదల, మూలధన ప్రతిఫలం తదితరాలు)లో ఏర్పడ్డ వ్యత్యాసం రూపేణా రూ.2,910.74 కోట్లు ట్రూ–అప్‌ చార్జీలను వసూలు చేసుకునేందుకు ఏపీఈఆర్‌సీ ఉత్తర్వుల మేరకు డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఒక్కో యూనిట్‌కు రూ.0.07 పైసలు చొప్పున అనుమతించిన దానిలో సగం మాత్రమే డిస్కంలు వసూలు చేశాయి. అదీ ఆమోదిత, వాస్తవ పంపిణీ ఖర్చు (నిర్వహణ వ్యయం, తరుగుదల, మూలధన ప్రతిఫలం తదితరాలు) వ్యత్యాసాన్ని మండలి ఉత్తర్వుల మేరకు వసూలు చేస్తున్నాయి.

నిజానికి ఈ చార్జీలు టీడీపీ హయాంలోనే సర్దుబాటు చేయాల్సి ఉంది. 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్లకు టీడీపీ ప్రభుత్వ సబ్సిడీ రూ.17,487 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.10,923 కోట్లు మాత్రమే చెల్లించింది. రూ.6,564 కోట్లు చెల్లించలేదు. ఆ పాపమే ట్రూ–అప్‌గా ప్రజలపై పడింది. 2019–20 నుంచి 2023–24 వరకూ నాలుగేళ్లలోనే సబ్సిడీ రూ.2,0375 కోట్లు మంజూరు చేసి, రూ.20,479 కోట్లను ప్రస్తుత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించింది. 

ఆరోపణ: చార్జీల పెంపు.. శ్లాబుల్లో మార్పులు చేసి ఏటా రూ.1,400 కోట్లభారాన్ని 2022 ఏప్రిల్‌ నుంచి ప్రభుత్వం వేసింది.
వాస్తవం :  2022 ఏప్రిల్‌ నుంచి శ్లాబులు, యూనిట్‌ రేట్లను పెరుగుతున్న సరఫరా వ్యయానికి అనుగుణంగాపెంచింది. అదీగాక గృహ వినియోగ కేటగిరీ సరఫరా వ్యయం రూ.7.79 కాగా, బిల్లింగ్‌ రేటు రూ.5.13 మాత్రమే ఉంది. అంటే గృహ వినియోగదారులకు సరఫరావ్యయంతో పోలిస్తే తక్కువ ధరే వసూలు చేస్తోంది. అప్పుడు భారం ఎవరిపై పడినట్లు డ్రామోజీ? 

మేలు చేయడం మోసమా?
ఏటా విద్యుదుత్పత్తికి సంబంధించిన చార్జీలు పెరుగుతుండటంతో వాటికి అనుగుణంగా విద్యుత్తు కొనుగోలు చార్జీలూ పెరుగుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకునే వినియోగించిన విద్యుత్తుకు అనుగుణంగా చార్జీలపై ఏపీఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో ప్రభుత్వానికిగానీ, విద్యుత్తు సంస్థలకుగానీ ఎలాంటి ప్రమేయమూ  ఉండదు. జాతీయ టారిఫ్‌ విధానం ప్రకారం గతంలో ఉన్న టారిఫ్‌ శ్లాబులను స్థిరీకరణ చేయడం ద్వారా శ్లాబ్‌లలో మార్పులు జరిగాయి.

కేటగిరీ వారీగా చూస్తే టారిఫ్‌ ధరలు పెరగడం లేదు. పైగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ సామాన్య ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ సూచనలతో విద్యుత్తు సంస్థల పరిధిలో సామాన్యులు మోయలేనంతగా చార్జీలను వసూలు చేయడం లేదు. వినియోగించిన విద్యుత్తుకు అనుగుణంగానే వసూలు చేస్తోంది.

 ఏటా విద్యుదుత్పత్తికి సంబంధించిన వ్యయం పెరుగుతుండడంతో వాటికి అనుగుణంగానే కొనుగోలు చార్జీలూ పెరుగుతున్నాయి. అలా పెరిగినా ఆ భారం పేదలపై పడకూడదని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు (గతంలో 100 యూనిట్లుగా ఉండేది), బాగా వెనుకబడిన తరగతుల వినియోగదారులకు 100 యూనిట్ల వరకు, క్షౌరశాలలకు 150యూనిట్ల వరకు, రజక వినియోగదారులకు 150 యూనిట్ల వరకు, చేనేత వృత్తి వినియోగదారులకు 100 యూనిట్ల వరకు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్తును ప్రభుత్వం రాయితీ ద్వారా అందిస్తోంది. ఇది ప్రణాళికతో చేస్తున్న మేలేగానీ మోసం ఎలా అవుతుంది రామోజీ?

 డిస్కంలు మరో రూ.7,200 కోట్లు ట్రూ–అప్‌ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరితే ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను ఏపీఈఆర్‌సీ పక్కన పెట్టిందని ఈనాడు అర్థంలేని ఆరోపణ చేసింది. రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తిలో న్యాయమూర్తి హోదా కలిగిన అత్యున్నత వ్యక్తి నేతృత్వంలో నడిచే ఏపీఈఆర్‌సీ ఓ రాజకీయ పార్టీకిగానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వానికిగానీ జవాబుదారీ కాదనే విషయం రామోజీకి తెలియదా. అలాంటి ఏపీఈఆర్‌సీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుందని ఎలా అంటారు. పైగా రూ.7,200 కోట్ల భారం ప్రజలపై వేయడానికి అంగీకరించకపోవడం మంచి విషయం కాదంటారా?

 రాష్ట్రంలోని దాదాపు రెండు కోట్ల మంది వినియోగదారులకు వారి కుటుంబాలకు ఊరట కలిగిస్తూ.. ఎలాంటి చార్జీల భారం లేకుండా 2024–25 టారిఫ్‌ ఆర్డర్‌ను ఏపీఈఆర్‌సీ ఆమోదించింది. మూడు డిస్కంలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సబ్సిడీ రూ.13,589.18 కోట్ల భారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. గతేడాది కంటే ఇది రూ.3,453.96 కోట్లు అధికం. 2020–21 నుంచి  రైల్వే ట్రాక్షన్‌కు టారిఫ్‌లో పెంపుదల లేనందున, వాస్తవ సేవా ఖర్చు, ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించేలా ఇంధన చార్జీలు యూనిట్‌కు రూ.5.50 నుంచి రూ.6.50కి అంటే కేవలం రూ.1 పెంచడానికి కమిషన్‌ ఆమోదించింది.

విద్యుత్తు వాహన చార్జింగ్‌ స్టేషన్లకు, డిస్కంలు అందించే విద్యుత్తు రేటును సేవా ఖర్చు (కాస్ట్‌ ఆఫ్‌ సర్వీస్‌) స్థాయికి పెంచాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనను కమిషన్‌ ఆమోదించలేదు. విద్యుత్తు వాహనాల వాడకాన్ని ప్రోత్స­హిం­చేందుకు వాటి టారిఫ్‌ను యథాతథంగా డిమాండ్‌ చార్జీలు లేకుండా, ప్రస్తుతం ఉన్న యూనిట్‌కు రూ.6.70గానే నిర్దేశించారు. మరి రాయితీ ఉపసంహరణ ద్వారా రూ.251 కోట్ల భారం త్వరలో అమలవుతుందని పచ్చి అబద్ధాలు ఎలా అచ్చేస్తారు డ్రామోజీ?   

Advertisement
Advertisement