
కె కన్నప్పరాజు
అమరావతి: నెడ్‌కాప్ (న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ- NREDCAP) చైర్మన్‌గా కె.కన్నప్పరాజు నియమితులయ్యారు. రెండేళ్లపాటు చైర్మన్ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల 137 కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల భర్తీని ఏపీ చేపట్టింది. అందులో కేకే రాజును కూడా నియమించగా తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. నెడ్‌కాప్ చైర్మన్‌గా త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కేకే రాజుగా గుర్తింపు పొందిన కన్నప్పరాజు విశాఖపట్టణం జిల్లాకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.