
శాంతిప్రియ
డోన్ (నంద్యాల): సజీవంగా ఉన్న వారిని మృతి చెందారంటూ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఈనాడు పత్రిక అధిపతి రామోజీపై సంబంధిత వ్యక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డోన్ పట్టణంలోని చిగురమానుపేటకు చెందిన కొండవేగు శాంతిప్రియతో పాటు ఆమె భర్త పేర్లు ఓటరు జాబితాలో ఉండడాన్ని ఉదహరిస్తూ వీరు మృతి చెంది రెండు సంవత్సరాలు అయిందంటూ ఈనాడులో తప్పుడు కథనం ప్రచురించడంపై శాంతిప్రియ అవాక్కయ్యారు.
ఎక్స్‌ఐవై 2122539 అనే ఓటరు కార్డుతో 17వ వార్డు 11వ సచివాలయంలో తాను నివశిస్తున్నానని.. అయితే పచ్చపత్రిక ఈనాడులో ‘ఆత్మకు ఓట్లు’ అనే శీర్షికన తన పేరును ప్రచురించడం దుర్మార్గమైన చర్య అని శాంతిప్రియ మండిపడ్డారు. ఇటీవలకొందరు వ్యక్తులు మృతి చెందారంటూ వారి ఫొటోలను ఈనాడులో ప్రచురించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.