పేర్లు మాత్రమే వేరు.. మనుషులు ఇద్దరూ ఒక్కటే: విడదల రజిని

Minister Vidadala Rajini slams chandrababu and Pawan Kalyan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పేర్లు మాత్రమే వేరని.. మనుషులు ఇద్దరూ ఒక్కటే అని మంత్రి విడదల రజని అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితలు ఉన్నాయయనేది వాళ్లు కలిసి చేస్తున్న దుష్ప్రచారమని మండిపడ్డారు. చంద్రబాబును గెలిపించేందుకు పవన్‌ తాపత్రయపడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సీఎం జగన్‌ వెంటే ప్రజలు ఉంటారని చెప్పారు. అమాయక ప్రజల ప్రాణాలను కాపాడేందుకే జీవో-1 తీసుకొచ్చామని తెలిపారు. కందుకూరు, గుంటూరు ఘటనలలో ప్రాణాలు కోల్పోయిన బాధితులను పరామర్శించకుండా పవన్‌, చంద్రబాబు ఒకరిని ఒకరు పరామర్శ చేసుకోవడం విడ్డూరంగా ఉందని మంత్రి విడదల రజిని అన్నారు. 

చదవండి: (నాడు-నేడుకు లారస్‌ ల్యాబ్స్‌ రూ.4 కోట్ల విరాళం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top