
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 13 సెక్టార్లలో పెట్టుబడులపై దృష్టి పెట్టామన్నారు. ముకేష్ అంబానీ, టాటా చంద్రశేఖర్, ఆనంద్ మహేంద్రను ఆహ్వానించామన్నారు.
‘‘మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరిగే సమ్మిట్‌తో రాష్ట్రానికి మేలు జరుగుతుంది. చంద్రబాబు రూ.18 లక్షల కోట్ల ఎంవోయూలు చేసుకుంటే.. కేవలం లక్షా 80వేల కోట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. వాస్తవ పెట్టుబడులపైనే మా దృష్టి. 1.8 లక్షల కోట్లపైనే పెట్టుబడులు తీసుకురావడం మా లక్ష్యం. విశాఖ కాస్మోపాలిటన్ సిటీ.. అవసరమైన మౌలిక సదుపాయాలున్నాయి. అందుకే జీ 20 సదస్సు కూడా విశాఖలో నిర్వహిస్తున్నారు’’ అని మంత్రి అన్నారు.
‘‘రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్ర ప్రభుత్వం గతంలోనే అఫిడవిట్ ఇచ్చింది. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నదే మా ధ్యేయం. చంద్రబాబు, తన వారి సంపద పెంచుకోవడానికే అమరావతి. లోకేష్ పాదయాత్రను చూసి చంద్రబాబు సైకోగా మారాడు. పాదయాత్ర పరిస్థితి కూలీ ఇచ్చి కొట్టించుకున్నట్టుగా ఉంది’’ అని మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు.
చదవండి: నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి