
నంద్యాల జిల్లా: మండల పరిదిలోని కానాల గ్రామానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైంది. సంజామల ఎస్‌ఐ రమణయ్య తెలిపిన వివరాల మేరకు..కానాల గ్రామానికి చెందిన సోము భాస్కర్‌రెడ్డి కుమార్తె సోము శశిరేఖకు నంద్యాలకు చెందిన శ్రీహరి రెడ్డితో 2023 సంవత్సరంలో వివాహమైంది.
భార్యాభర్తల వ్యక్తిగత గొడవల కారణంగా సోము శశిరేఖ పెళ్లి అయిన కొన్ని నెలలకే తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత వారి నుంచి కూడా బయటకు వెళ్లిపోయింది. అయితే, తన భార్య కనిపించడం లేదని శ్రీహరి రెడ్డి మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.