దేశానికే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలిచింది: ఆదిమూలపు | Mana Badi Nadu Nedu Adimulapu Suresh Speech Highlights In East Godavari | Sakshi
Sakshi News home page

దేశానికే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలిచింది: ఆదిమూలపు

Aug 16 2021 2:10 PM | Updated on Aug 16 2021 7:02 PM

Mana Badi Nadu Nedu Adimulapu Suresh Speech Highlights In East Godavari - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలోని స్కూళ్ల రూపురేఖలు మార్చారని, పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేసి చూపించారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సోమవారం సీఎం జగన్‌ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా 'జగనన్న విద్యాకానుక'ను ప్రారంభించారు. విద్యాకానుక కింద కొంతమంది విద్యార్ధులకు కిట్లను పంపిణీ చేశారు. అనంతరం పి. గన్నవరం జెడ్పీహెచ్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సభలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ‘‘ కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించాం. తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాల అభివృద్ధి చేశాం. రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టాం. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. దేశానికే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలిచింది’’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement