ఆమెకు 31.. అతనికి 21! | Man And Woman Life End In Visakhapatnam Due To Different Reasons, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆమెకు 31.. అతనికి 21!

Jan 28 2025 8:09 AM | Updated on Jan 28 2025 10:45 AM

man and woman life end in visakhapatnam

పద్మనాభం: మండలంలోని కృష్ణాపురంలో సోమవారం వేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకరు వివాహిత, ఇంకొకరు యువకుడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. దీనికి సంబంధించి సీఐ సీహెచ్‌ శ్రీధర్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. 

కృష్ణాపురం గ్రామానికి చెందిన కనకల లక్ష్మి(31) తన ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని మృతి చెందగా.. అదే గ్రామానికి చెందిన మొకర ఆదిత్య(21) స్ప్రింగ్‌ ఫీల్డ్‌ పాఠశాల వెనుక ఉన్న షెడ్‌లో చీరతో ఉరివేసుకొని మృతి చెందాడు. వీరి మధ్య కొన్నాళ్లగా వివాహేతర సంబంధం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మృతుడు ఆదిత్య తండ్రి రవి, మృతురాలు లక్ష్మి భర్త శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఒక్కగానొక్క కొడుకు
మొకర రవి, జానకి దంపతులకు ఆదిత్య ఒక్కగానొక్క కొడుకు. విశాఖ నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు మృతితో తల్లి దండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

తల్లి ప్రేమను కోల్పోయిన చిన్నారులు
కనకల శంకర్‌, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో తేజేష్‌ 4వ తరగతి, ధను 2వ తరగతి చదువుతున్నారు. లక్ష్మి మృతితో ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. తల్లి మృతదేహం వద్ద ఈ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చూస్తున్న చూపులు అందరిని కలచివేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement