
తిరుమలలో మరోసారి చిరుత పులి అలజడి రేగింది. అలిపిరి-ఎస్వీ పార్క్ జూ రోడ్డులో వెళ్తున్న బైకర్లపై చిరుత దాడికి యత్నించింది. అయితే బైకర్లు తృటిలో తప్పించుకోగా.. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
తిరుమలలో శుక్రవారం సాయంత్రం బైకర్ల మీద ఓ చిరుత దాడికి యత్నించింది. రోడ్డు పక్కన కల్వర్టు మాటున దాక్కుని.. బైక్ రాగానే వాళ్ల మీదకు దూకింది. అయితే వాళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే చిరుత పొదల్లోకి వెళ్లింది. వెనక కారులో వస్తున్నవాళ్లు ఆ ఘటనను వీడియో తీశారు. అందకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరింది. అయితే ఈ వీడియోపై అధికారులు స్పందించాల్సి ఉంది.
తిరుపతి ఎస్వీ జూ పార్క్ రోడ్లో ద్విచక్రవాహనం పై చిరుత దాడి చేసింది. #Tirupati #zooparkroad #tirupatizooparkroad #LeopardAttack #leopard #tirupatiupdates pic.twitter.com/IBiwvW2lpr
— Tirupati Updates (@TirupatiUpdates) July 25, 2025
తిరుమలలో ఈ మధ్యకాలంలో వన్యమృగాల సంచారం పరిపాటిగా మారింది.
జూలై 2025: అన్నమయ్య భవనం వెనుక చిరుత గేటుపై కూర్చొన్న ఘటన భక్తులను ఆందోళనకు గురిచేసింది.
జూన్ 2025: అదే ప్రాంతంలో మరో చిరుత ఇనుప కంచె దాటి ప్రవేశించింది. సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి.
2024లో: అలిపిరి కాలిబాట మార్గంలో చిరుతలు, ఎలుగుబంట్లు సంచారం కారణంగా భక్తులపై దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో TTD అధికారులు అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు.
వన్యమృగాల కదలికలను గుర్తించేందుకు అధునాతన GSM టెక్నాలజీతో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో.. రాత్రి నడక మార్గం మూసివేతతో పాటు సిబ్బందితో గుంపులుగా పంపించడం వంటి చర్యలు తీసుకున్నారు.
