ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయండి | High Court issues clarification to lower courts on child trafficking cases | Sakshi
Sakshi News home page

ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయండి

Aug 29 2025 3:07 AM | Updated on Aug 29 2025 3:07 AM

High Court issues clarification to lower courts on child trafficking cases

చిన్నారుల అక్రమ రవాణా కేసులపై కింది కోర్టులకు హైకోర్టు స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: చిన్నారుల అక్రమ రవాణా కేసుల్లో విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్రంలోని అన్ని కోర్టుల న్యాయాధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులపై రోజూ వారీ విధానంలో విచారణ జరపాలని తేల్చిచెప్పింది. అక్రమ రవాణా కేసులు ఎన్ని ఉన్నాయి? వాటి విచారణ ఏ దశలో ఉంది? తదితర వివరాలను తమకు అందచేయాలని ఆదేశించింది. తమ సూచనలను తప్పనిసరిగా అమలు చేసి తీరాలని న్యాయాధికారులకు తేల్చి చెప్పింది. 

ఈ మేరకు రిజిస్ట్రార్‌ జనరల్‌ వైవీఎస్‌బీజీ పార్థసారథి ఇటీవల సర్కులర్‌ జారీ చేశారు. పింకీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉత్తరప్రదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 15న ఓ తీర్పు వెలువరించింది. చిన్నారుల అక్రమ రవాణా కేసుల్లో విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని దేశంలోని అన్ని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు తీర్పు గురించి హైకోర్టు వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement