ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం | Heavy Rains Lash Several Districts of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం

May 26 2026 8:12 PM | Updated on May 26 2026 8:22 PM

Heavy Rains Lash Several Districts of Andhra Pradesh

విజయవాడ:   ఏపీలో ఒకవైపు తీవ్రమైన ఎండలు.. మరొకవైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండతో కాసింత ఉపశమనం పొందామనుకునే లోపే పిడుగులతో కూడిన వర్ష బీభత్సంతో ప్రజలు హడలిపోతున్నారు. 

ఈ రోజు(మంగళవారం, మే 26వ తేదీ) చిత్తూరు, తిరుపతి, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడగా, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో  ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంటలకు 50 కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. 

అనకాపల్లి జిల్లాలో భారీ ఈదురు గాలలతో వర్షం పడింది. గంటకు పైగా భీకరమైన గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనలకు లోనయయారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షం పడింది. మండల పరిధిలోని కారుమంచివారి కండ్రిగ గ్రామంలో పిడుగు పడి యువకుడు మృతిచెందాడు. - గ్రామ సమీపంలోని పంట పొలాల వద్ద క్రికెట్ ఆడుతుండగా ప్రమాదం జరిగింది.   మృతుడు కారుమంచి వారు కండ్రిగ గ్రామానికి చెందిన  తోప్పని యశ్వంత్(22) గా గుర్తింంచారు. 

అదేవిధంగా పట్టణంలోని ఎల్ ఏ సాగరం గిరిజన కాలనీలోని పాఠశాల ఆవరణంలో ఉన్న కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు పడి ఆ చెట్టు పూర్తిగా దగ్ధమైంది. అయితే సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement