వేమూరి హరికృష్ణ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా

Hearing on Vemuri Harikrishna petition has been adjourned till today - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ఫైబర్‌ నెట్‌ కుంభకోణంపై నమోదు చేసిన కేసులో నిందితుడిగా పేర్కొన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ విషయంలో మంగళవారం వరకు అతని అరెస్ట్‌తో సహా ఎలాంటి తొందరపాటు చర్యలేవీ వద్దని హైకోర్టు సీఐడీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని కోరింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత ఉత్తర్వులు జారీ చేశారు. ఫైబర్‌ నెట్‌ టెండర్ల మదింపు సాంకేతిక కమిటీలో సభ్యుడిగా ఉన్న హరికృష్ణ ప్రసాద్‌ సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్‌ లలిత విచారణ జరిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top