తుమ్మపూడిలో ఉద్రిక్తత.. లోకేష్‌ రాకతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు

Guntur: TDP Activists Over Action At Tummapudi After Lokesh Came - Sakshi

సాక్షి, గుంటూరు: దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య కేసులోని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేష్‌ రావడంతో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. దీంతో టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పోలీసులకు గాయాలు అయ్యాయి.

అంతకుముందు తెనాలి ఆసుపత్రి దగ్గర కూడా టీడీపీ నాయకులు వీరంగం సృష్టించారు. తిరుపతమ్మ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్తుంటే అంబులెన్‌ను అడ్డుకున్నారు. లోకేష్‌ వచ్చేవరకు మృతదేహాన్ని ఆపాలంటూ హంగామా చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టీడీపీ నాయకులను చెదరగొట్టారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. అయితే తుమ్మపూడిలో లోకేష్‌ రాగానే  మరోసారి రెచ్చిపోయారు టీడీపీ నాయకులు.
చదవండి👉 తుమ్మపూడి మహిళ హత్య కేసులో సంచలన విషయాలు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top