నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్‌’ నిగ్గుతేల్చండి 

Governor Office Orders Inquiry Into Nimmagadda Ramesh House Rent Allowance - Sakshi

గవర్నర్‌ కార్యాలయం ఆదేశించిందన్న యూఎఫ్‌ఆర్‌టీఐ ప్రతినిధులు  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్రంలో నివాసమే ఉండకుండా ప్రతినెలా ఇంటి అద్దె అలవెన్స్‌ పొందుతున్నట్టుగా వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలంటూ గవర్నర్‌ కార్యాలయం ఆదేశించినట్టు యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఆర్‌టీఐ క్యాంపెయిన్‌(యూఎఫ్‌ఆర్‌టీఐ) ప్రతినిధులు గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తమకు గవర్నర్‌ కార్యాలయం సమాచారమిచ్చిందని వారు వెల్లడించారు.

యూఎఫ్‌ఆర్‌టీఐ ప్రతినిధులు నిమ్మగడ్డపై గత డిసెంబర్‌ 14న గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు ఏం తీసుకున్నారో తెలియజేయాలని కోరుతూ యూఎఫ్‌ఆర్‌టీఐ ప్రతినిధులు జంపాన శ్రీనివాసగౌడ్, నస్రీన్‌బేగంలు తాజాగా గవర్నర్‌ కార్యాలయం నుంచి సమాచారం కోరారు. దీనికి గవర్నర్‌ కార్యాలయ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ బదులిస్తూ.. ఆ ఫిర్యాదుపై తగిన విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిని డిసెంబర్‌ 24న ఆదేశించినట్టు తెలిసినట్టు వారు పేర్కొన్నారు.
(చదవండి: ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం!)
ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top