ముగిసిన గ్రామ సచివాలయాల తొలిరోజు పరీక్ష

First Examination Of Village Secretariat Is Over - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 74 శాతం మంది అభ్యర్థులు హాజరు అయ్యారని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. మొత్తం 3,44,488మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు ఆయన పేర్కొన్నారు.

కాగా విశాఖలో సచివాలయ ఉద్యోగ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 277 పరీక్ష కేంద్రాల్లో దాదాపు లక్షా యాభైవేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా నిన్నటి నుంచి ఆర్టీసీ బస్సులు జిల్లావ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో కూడా నడిపారు. నిర్ణీత సమయానికి గంటన్నర ముందు నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. (జేఈఈ అడ్వాన్సుకు తగ్గిన దరఖాస్తులు)

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు జరిగాయి. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణ పట్ల విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్‌ కష్టకాలంలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు జరపడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top