మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్(59) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన విశాఖ వన్‌టౌన్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
అపర రాజకీయ చాణిక్యుడు ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడుగా ద్రోణంరాజు శ్రీనివాస్‌కు ఉత్తరాంధ్రలో చెరగని ముద్ర వేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్ కు భార్య శశి, కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీవత్సవ ఉన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల మంత్రి అవంతి శ్రీనివాస్ రావు, ద్రోణంరాజు రవికుమార్ సంతాపం ప్రకటించారు. శ్రీనివాస్ మృతి బ్రాహ్మణ సమాజానికి తీరని లోటని రవికుమార్ అన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి