
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్, వైద్య సిబ్బందిపై పచ్చ నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. పచ్చ బ్యాచ్ దాడిలో వారు గాయపడటంతో ఆసుప్రతికి తరలించారు. ఈ నేపథ్యంలో తమ దాడిని ఖండిస్తూ సత్యసాయి జిల్లాలో వైద్యులు విధులు బహిష్కరించి నిరసనలకు దిగారు.
వివరాల ప్రకారం.. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. కదిరి మండలం కుటాగుళ్ల బెల్టు షాపు వద్ద డాక్టర్, వైద్య సిబ్బందితో టీడీపీ నేతలు గొడవకు దిగారు. అనంతరం, విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది గాయపడటంతో అతడిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మరోసారి వైద్య సిబ్బందిని అడ్డుకుని దాడి చేశారు. ఈ ఘటన స్థానిక సీసీటీవీలో రికార్డు అయ్యింది. టీడీపీ నేతల దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు, కదిరిలో వైద్య సిబ్బందిపై దాడిని డాక్టర్లు తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతల దాడికి నిరసనగా కదిరిలో డాక్టర్లు విధులను బహిష్కరించారు. టీడీపీ కార్యకర్తలపై దాడిపై మండిపడుతున్నారు. వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయినట్టు సమాచారం.
