వైఎస్‌ జగన్‌కు వైద్యుల ఫిర్యాదు | Doctors Meet CM Jagan on Aarogyasri Closure | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు వైద్యుల ఫిర్యాదు

Jun 2 2026 7:06 PM | Updated on Jun 2 2026 8:00 PM

Doctors Meet CM Jagan on Aarogyasri Closure

సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోయి పేదలు నాణ్యమైన వైద్యానికి దూరమయ్యారంటూ డాక్టర్లు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటురూ జిల్లా డాక్టర్లు వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా  రాష్ట్రంలో ఆరోగ్రశ్రీ నిర్వీర్యం కావటంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది పేద రోగులు చికిత్సకు నోచుకోలేకపోతున్నారన్న డాక్టర్లు..ఆసుపత్రులకు మంజూరు చేసే ఎల్వోసీలు కూడా పారదర్శకంగా లేవన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఆసుపత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. కమీషన్ల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నారని వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం, వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న లక్ష్యంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తెచ్చారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం. 

మరిన్ని వ్యాధులను చేర్చడంతో పాటు చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి ఆర్థిక సహాయం అందించాం. రోగులకు మెరుగైన సేవలు అందించేలా అనేక సంస్కరణలు చేపట్టాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశాం. కొత్త మెడికల్ కాలేజీలు, గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టాం. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. కానీ చంద్రబాబు సర్కార్ వాటిని నిర్వీర్యం చేయటం బాధాకరం. బాధితులకు అండగా నిలుద్దాం’అని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement