జీబ్రాలు నిలబడే  నిద్రపోతాయి.. ఎందుకో తెలుసా?

Did You Know That Zebras Sleep While Standing - Sakshi

ఆరిలోవ(విశాఖపట్నం): జంతువులు అన్ని రంగులను ఆసక్తిగా చూస్తుంటాయి. వాటి చూపును బట్టి ఆయా రంగులను గుర్తిస్తున్నాయని మనం భావిస్తాం. జీబ్రాలు మాత్రం పచ్చని రంగును గుర్తించలేవట. కానీ ఒకేసారి వాటి కంటితో రెండు దృశ్యాలను చూడగలవట. ఈ విషయం వన్యప్రాణుల సంరక్షణ చేసేవారికి మాత్రమే తెలుస్తుంటుంది. ఇంకా వాటి గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తిగల విషయాలు ఉన్నాయండోయ్‌..
చదవండి: నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు.. బాగున్నారా..

జీబ్రాలు అడవుల్లో సుమారు 1,000 వరకు గంపులుగా తిరుగుతాయి. అవి గంటకు 40 కిలోమీటర్లు వేగంతో పరుగెత్తుతాయి. ఇవి తిన్నగా కాకుండా అడ్డదిడ్డంగా పరుగెడుతాయట. అందుకే వేటగాళ్లకు ఇవి దొరకవట. ఒకవేళ వేటగాళ్లుగానీ, హైనా, సింహం తదితర క్రూర మృగాలుగానీ వాటిని వేటాడినప్పుడు వెనుక కాళ్లతో తన్ని వాటిని అవే రక్షించుకుంటాయి. పిల్ల జీబ్రా కూడా పుట్టిన గంటకు పరుగెడుతుందట. వీటిలో మరో విశేషమేమంటే ఇవి నిలబడే నిద్రపోతాయి. ఏ రెండు జీబ్రాలకు వాటి శరీరంపై ఉన్న చారలు ఒకేలా ఉండవు. ఇవి వాటిపై దాడిచేసే క్రూర మృగాలను తికమకపెడతాయట.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top