విజయవాడ లిబర్టీ ఆసుపత్రిలో కోవిడ్‌ వైద్యం రద్దు

Collector Imtiaz Canceled Covid‌ Treatment At Liberty Hospital - Sakshi

సాక్షి, విజయవాడ : కరోనా వైద్యం పేరుతో పలు ఆసుపత్రులు లక్షల రూపాయలు వసూలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నా ప్రైవేటు ఆసుపత్రుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా లక్షల్లో ఫీజు వసూలు తన భర్త ప్రాణాలు పోగొట్టారని విజయవాడ లిబర్టీ ఆసుపత్రి యాజమాన్యంపై మహిళ  ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదివారం ఈ ఘటనపై సీరియస్‌ అయ్యారు. విజయవాడకు చెందిన లిబర్టీ ఆసుపత్రిలో కోవిడ్‌ వైద్యం రద్దు చేస్తున్నట్లు తెలిపారు.(చదవండి : పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్)‌ 

రాజమండ్రికి చెందిన మహిళ ఫిర్యాదుతో విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. లిబర్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధిక ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కమిటీ అందించిన నివేదికతో ఆటోనగర్‌లో ఉన్న లిబర్టీ ఆసుపత్రిలో కరోనా వైద్యం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను వేరే చోటికి తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top