టోక్యో ఒలింపిక్స్‌: ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు

CM YS Jagan Wishes To Tokyo Olympic Participated Players In Japan - Sakshi

సాక్షి, తాడేపల్లి: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న క్రీడాకురులు పీవీ సింధు, ఆర్‌ సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌ను సీఎం జగన్‌ అందజేశారు.

విశాఖపట్నంలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను సీఎం జగన్‌ పీవీ సింధుకి అందించారు. అదే విధంగా రజనీ(ఉమెన్స్‌ హకీ) బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామ్‌గోపాల్, శాప్‌ ఉద్యోగులు వెంకట రమణ, జూన్‌ గ్యాలియో, రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: AP: కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top