
మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌పై సీఐ రాజగోపాల్‌నాయుడు దాష్టీకం
సత్యసాయి జిల్లా: గౌరవంగా నమస్తే పెట్టిన పాపానికి ఓ కౌన్సిలర్ పోలీసు దాషీ్టకానికి బలయ్యాడు. వివరాల్లోకెళితే.. హిందూపురం మున్సిపల్ వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ ఆసిఫ్‌వుల్లా శనివారం రాత్రి పట్టణంలోని అల్‌హిలాల్ కాంప్లెక్స్ వద్ద తన బట్టల దుకాణం వద్ద నిల్చొని ఉన్నారు. అటు వైపు నుంచి సీఐ జీపు రాగానే నమస్తే పెట్టారు. దీనికి ఆగ్రహించిన సీఐ రాజగోపాల్‌నాయుడు.. నాకే నమస్తే పెడతావా అంటూ ఆసిఫ్‌వుల్లాను కొట్టడంతో పాటు స్టేషన్‌కు లాక్కెళ్లారు.
ఏం నేరం చేశానని ప్రశ్నించిన పాపానికి దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి , కౌన్సిలర్ శివ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. వేణురెడ్డి మాట్లాడుతూ సీఐ ఆగడాలు మితిమీరిపోయాయని, వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.