రఘురామకృష్ణంరాజు: సోదాలపై సీబీఐ ప్రకటన | CBI Press Note On Raghurama krishnam Raju | Sakshi
Sakshi News home page

రఘురామకృష్ణంరాజు: సోదాలపై సీబీఐ ప్రకటన

Oct 8 2020 8:17 PM | Updated on Oct 8 2020 8:30 PM

CBI Press Note On Raghurama krishnam Raju - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులను మోసగించిన వ్యవహారంపై ఎంపీ రఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలపై గురువారం సీబీఐ మీడియాకు ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొంది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు తెలిపింది. నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. దీనిలో భాగంగానే హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో గురువారం సోదాలు నిర్వహించింది.  కంపెనీ కార్యాలయాలు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాలపై సోదాలు జరిపినట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. (రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement