రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు

CBI Raids On MP Raghurama Krishnam Raju - Sakshi

రఘురామకృష్ణం రాజు నివాసంలో సీబీఐ సోదాలు

సాక్షి, హైదరాబాద్‌ : నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై కేంద్ర దర్యాప్త సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. బ్యాంక్‌ లోన్‌ బకాయిలపై కేసు నమోదు చేసిన సీబీఐ గురువారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈనెల 6న హైదరాబాద్‌, ముంబై సహా 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. రఘురామకృష్ణంరాజు సహా 9 మందిపై సీబీఐ చీటింగ్‌ కేసు నమోదు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టారు. ఇండ్‌-భారత్‌ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి  సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. ఈ దాడుల్లో పలు కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

2019 ఏప్రిల్‌ 30న బ్యాంక్‌ లోన్‌ బకాయిలు పడిన కేసులో సైతం హైదరాబాద్‌, భీమవరంలోని రఘురామకృష్ణంరాజు కంపెనీల్లో సోదాలు చేపట్టారు. వివిధ ప్రాజెక్ట్‌లకు సంబంధించి రూ.600 కోట్ల మేర ఆయన రుణాలు తీసుకున్నారు. ఇక ఇండ్‌-భారత్‌ పవర్‌ లిమిటెడ్‌కు సంబంధించి రూ.947 కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగ్గవేయగా, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూట్ల నుంచి రూ.2655 కోట్ల మేర రఘురామకృష్ణంరాజు లోన్‌ తీసుకున్నారు. ఈ సోదాల్లో 11 నుంచి 14 సీబీఐ బృందాలు పాల్గొన్నట్టు సమాచారం. బ్యాంకులకు ఎగవేతపై రఘురామకృష్ణంపై సీబీఐ దాడులు ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా సీబీఐ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top