breaking news
banks fraud
-
రఘురామకృష్ణంరాజు: సోదాలపై సీబీఐ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులను మోసగించిన వ్యవహారంపై ఎంపీ రఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలపై గురువారం సీబీఐ మీడియాకు ప్రెస్‌నోట్ విడుదల చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొంది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు తెలిపింది. నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. దీనిలో భాగంగానే హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. కంపెనీ కార్యాలయాలు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాలపై సోదాలు జరిపినట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. (రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు) -
కారు రుణం పేరుతో బ్యాంకులకు బురిడీ
బంజారాహిల్స్: బ్యాంకుల్లో కారు రుణాలు తీసుకుంటూ తప్పుడు ధ్రువపత్రాలతో వాయిదాలు ఎగ్గొట్టిన ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కర్నేందుల విజయ్‌కుమార్ చాణుక్య అలియాస్ కె.జయకుమార్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అడ్డాల వీరవెంకట సత్యనారాయణమూర్తి అలియాస్ మూర్తి అడ్డాల కలసి బంజారాహిల్స్‌లోని సిండికేట్ బ్యాంకు శాఖలో తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి కారు రుణాలు తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకుండా పరారయ్యారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరిని పట్టుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. వారు స్టేట్‌బ్యాంకు ఆఫ్ మైసూర్, సిండికేట్ బ్యాంకు, కరూర్ వైశ్యా బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలలో కూడా తప్పుడు పత్రాలు పెట్టి కారు రుణాలతో పాటు స్థల రుణాలు కూడా తీసుకొని చీట్ చేసినట్లు విచారణలో తేలింది. వీరిద్దరూ జూబ్లీహిల్స్, ఆబిడ్స్, సైఫాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడు కేసుల్లో నిందితులని గతంలో కూడా చెన్నైతో పాటు మాదాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో 12 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తేలింది. వారి నుంచి రెండు ఇన్నోవా కార్లు, రెండు వెర్నా కార్లు, 23 ఐఫోన్లు, ఆరు మొబైల్ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఏడు రిస్ట్ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు.ఇలాంటి వారిపట్ల బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.